- ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా భట్టివిక్రమార్క
- రాంచీలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క
- రాహుల్ గాంధీ రావడంతో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించిన భట్టివిక్రమార్క
ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భేటీ అయ్యారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా భట్టివిక్రమార్క ఉన్నారు. దీంతో ఆయన ప్రస్తుతం రాంచీలో మకాం వేశారు. ఈ రోజు రాంచీకి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీకి భట్టివిక్రమార్క శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 70 చోట్ల జేఎంఎం, కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. మిగిలిన 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశాల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.