Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలుబిజినెస్ వార్తలు

ఖమ్మం మార్కెట్లోకి ఒకే రోజు బజాజ్ సిఎన్జి బైకులు, మహేంద్ర తార్ రాక్స్ వాహనాలు విడుదల! .

ఒకే రోజు ఖమ్మం మార్కెట్లోకి బజాజ్ వారి సిఎన్జి బైకులు మరియు మహేంద్ర తార్ రాక్స్ వాహనాలు విడుదల టూవీలర్ రంగంలో బజాజ్ వారు ప్రపంచంలోనే మొదటిసారిగా సిఎన్జి ద్వారా నడిచే ఫ్రీడమ్ బజాజ్ బైక్ తమ అధికృత డీలర్ వెంకటరమణ ఆటోమొబైల్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్నదని గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎలక్ట్రికల్ సిఎన్జి గ్యాస్ వాహనాలు ప్రజలు ఎక్కువగా వాడుతున్నారని ఫోర్ వీలర్ రంగంలోనే కాకుండా టు వీలర్ రంగంలో కూడా బజాజ్ వారు సిఎన్జి ని తీసుకురావడం ఎంతో సంతోషదాయకమని అని అన్నారు. అలాగే మీ వాహనాలకు ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ ఎలా కడుతున్నారో మన ఖమ్మం ప్రజలందరూ మున్సిపల్ టాక్స్ లు కూడా సకాలంలో కట్టి ఖమ్మం అభివృద్ధికి మీ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా సందర్భంగా వివిసి గ్రూపుల సంస్థ అధిపతి శ్రీ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వివిసి గ్రూప్ ఒకేసారి మూడు రకాల వాహనాలు విడుదల చేయటం ఇదే మొదట సారి అన్నారు. మొదటిగా ప్రపంచంలోనే మొదటిసారిగా బజాజ్ వారు టు వీలర్ రంగంలో సిఎన్జి వెహికల్ తీసుకురావటం ఎంతో ఆనందదాయకం అన్నారు. ఈ సిఎన్జి వెహికల్ పెట్రోల్ మరియు సీఎన్జీలో పనిచేస్తుందన్నార. రెండు కేజీల సిఎన్జి మరియు పెట్రోల్ తో సుమారు 300 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని అన్నారు. ఈ సిఎన్జి బైక్ ప్రీమియం లుక్ తో బ్యాటరీ లైఫ్ ఇండికేషన్ తో బ్లూటూత్ కనెక్టివిటీ తో మిస్సేడ్ కాల్ నోటిఫికేషన్ తక్కువ ధరకే ఇన్ని ఫీచర్స్ అవుతుంది అన్న ఫీలింగ్ జరుగుతుంది అని అన్నారు ఈ సీఎన్జీ బైక్ ఎక్స్ షోరూం ధర 94,995 లభ్యమవుతుంది అన్నారు. కెటిఎమ్ బైక్ ప్రియులకు సరికొత్తగా డ్యూక్ 200 సిసి టూ టౌన్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేయడమైనది. అలాగే మహేంద్ర మహీంద్రా మొదటిసారిగా 05 డోర్లతో 6 ఎయిర్ బ్యాగులతో వచ్చినదని అన్నారు. ఈ మహేంద్ర కార్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఒక గంటలో ఒక లక్ష 75000 కార్స్ బుక్ అయినవి. అంటే ఎంత డిమాండ్ గా ఉన్నదో అర్థం చేసుకోవాలని అన్నారు. మహేంద్ర కార్ పై కస్టమర్లకు ఉన్న ఒక నమ్మకమని నిరూపితమైనది. పవర్ఫుల్ సీతో ఆటోమేటిక్ మ్యాను ఆటోమేటిక్ మరియు మాన్యువల్ తో విడుదల చేసినట్లు చెప్పారు . ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ బాలకృష్ణ వివిసి సంస్థల చైర్మన్ ద్రౌపతి సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు…

Related posts

పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజు

Ram Narayana

ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్…

Ram Narayana

సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హ్యాట్సప్ …

Ram Narayana

Leave a Comment