- జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య
- కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచిన సంతోశ్ అనే వ్యక్తి
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 58 ఏళ్ల గంగారెడ్డిని జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో హత్య చేశారు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
ఈ హత్యను నిరసిస్తూ జగిత్యాల పాత బస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నా చేశారు. కాంగ్రెస్ నాయకులకే రక్షణ లేనప్పుడు తామెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం… జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు.