Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీలో ఈటలకు పరాభవం: క‌డియం శ్రీహ‌రి…

బీజేపీలో ఈటలకు పరాభవం: క‌డియం శ్రీహ‌రి
నడ్డా సమక్షంలో ఆయ‌న ఎందుకు చేరలేదో చెప్పాలి
ఆస్తులను కాపాడుకోవ‌డానికే ఆయ‌న బీజేపీలో చేరిన‌ట్లుంది
ఇన్నాళ్లు బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు
ఇప్పుడు అదే పార్టీలో చేరారు

బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహ‌రి మండిప‌డ్డారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో కాకుండా కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స‌మ‌క్షంలో ఈట‌ల బీజేపీలో చేర‌డంపై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీలో చేరేముందే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఆయ‌న‌ ఎందుకు చేరలేదో చెప్పాలని నిల‌దీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ లో చేరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఇక్కడుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక విమానం వేసుకుని పోయి అక్కడ బీజేపీ అధ్యక్షుడు సమక్షంలో కాకుండా మరొకరిచేత మెడలో కాషాయం కండువా కప్పించుకోవడం ఏమిటని ప్రశ్నించారు . దీనికోసం ఢిల్లీ దాక వెళ్లాలన్నా అని వ్యంగ్య బాణాలు సంధించారు.

ఆస్తులను కాపాడుకోవ‌డానికే ఆయ‌న బీజేపీలో చేరిన‌ట్లుంద‌ని కడియం శ్రీహ‌రి అన్నారు. ఇన్నాళ్లు బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించిన ఆయ‌న ఇప్పుడు అదే పార్టీలో చేరడం సిగ్గుచేటని క‌డియం శ్రీ‌హ‌రి విమ‌ర్శించారు. ఈట‌ల‌కు టీఆర్‌ఎస్‌ రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని, ఈ పార్టీలో అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఆ పార్టీపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

Related posts

టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌రి తెగించారు… కుప్పం ఘ‌ర్ష‌ణ‌ల‌పై స‌జ్జ‌ల ఆగ్ర‌హం

Drukpadam

కాంగ్రెస్ నేత కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్న యెడ్యూరప్ప కొడుకు!

Drukpadam

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

Drukpadam

Leave a Comment