Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. వాచ్‌మన్‌కు మరణశిక్ష…!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
  • ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక
  • నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం
  • ఆపై బండరాయితో మోది హత్య
  • నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు
  • రూ. 1.25 లక్షల జరిమానాతోపాటు మరణశిక్ష విధింపు

ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన నిందితుడిని దోషిగా తేల్చిన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 30న ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన గ్రామ వాచ్‌మన్ రజ్వీర్ సింగ్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బాలికను నీట ముంచి చంపే ప్రయత్నం చేశాడు. అది విఫలం కావడంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేసి పరారయ్యాడు. 

ఈ కేసులో రజ్వీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలం తర్వాత అతడే నిందితుడని తేల్చారు. తాజాగా ఈ కేసులో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడిని దోషిగా తేల్చి రూ. 1.25 లక్షల జరిమానాతోపాటు మరణశిక్ష విధించారు. ఈ తీర్పు వెలువరిస్తున్న సమయంలో బాధితురాలి తండ్రి కోర్టులోనే వుండి, ధన్యవాదాలు తెలిపారు. ఇక నిందితుడు జైలుకు వెళ్లినప్పటి నుంచి అతడి కుటుంబ సభ్యులు అతనికి దూరంగా వున్నారు. ఒక్కసారి కూడా అతడిని చూసేందుకు జైలుకి వెళ్లలేదు.  

Related posts

భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు: మధ్యప్రదేశ్ హైకోర్టు

Ram Narayana

ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరుపై సీఐడీకి న్యాయమూర్తి ప్రశ్న

Ram Narayana

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు రిమాండ్ … తీహార్ జైలుకు తరలింపు

Ram Narayana

Leave a Comment