Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడాపై జైశంకర్ తీవ్ర ఆగ్రహం….

  • కెనడా నిరాధార ఆరోపణలు చేస్తోందన్న జైశంకర్
  • భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టిందని… ఇది సరికాదని మండిపాటు
  • అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారని విమర్శ

కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడాలో ఓ హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో జైశంకర్ తీవ్రంగా స్పందించారు.

కెనడాపై తాను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నానని… ఒకటి నిరాధార ఆరోపణలు చేస్తోందని, రెండోది భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టిందని, ఇది సరైనది కాదని కేంద్రమంత్రి అన్నారు. మూడోది మనమంతా చూస్తున్నామని, అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అని ఆలయంపై దాడి ఘటనను ఉద్దేశించి అన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారనే విషయం తెలిసిపోతోందని విమర్శించారు.

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ దేశంతో భారత్‍‌కు సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో సహా గత ఐదు ప్రభుత్వాల హయాంలో ఆ దేశంతో భారత్ మంచి సంబంధాలను కొనసాగించిందని వెల్లడించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇరుదేశాల మధ్య స్నేహం పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు!

Ram Narayana

జపాన్ బుల్లెట్ రైల్లో పాము.. ప్రయాణం 17 నిమిషాల ఆలస్యం

Ram Narayana

ఈ బైబిల్ ధర రూ.57 కోట్లు!

Ram Narayana

Leave a Comment