- విద్యుత్ ఆధారిత వాహనాలకు సంబంధించిన కొత్త పాలసీకి రూపకల్పన
- ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు
- రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఉంటుందన్న పొన్నం ప్రభాకర్
తెలంగాణలో విద్యుత్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీ తీసుకువచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ రేపటి (నవంబరు 18) నుంచే అమలు కానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ కొత్త ఈవీ పాలసీ ఉపకరిస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో వాయు కాలుష్యం పరిస్థితులు హైదరాబాదులో ఏర్పడకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని అన్నారు.
తాజా ఈవీ పాలసీ ప్రకారం… ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా… రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు.
ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.