టీఆర్ఆర్.. హాస్పిటల్ జన ప్రాచుర్యం పొందాలి…ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
నగరంలో మరో కొత్త ఆసుపత్రి ప్రారంభోత్సవం
పేదలకు తక్కువ ఖర్చుకు సేవలు అందించడమే తమలక్ష్యం అంటున్న డాక్టర్ లక్ష్మణ్
నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఆర్ ఆర్థో, యాక్సిడెoట్ కేర్ హాస్పిటల్ జనo విశ్వాసాన్ని చూరగొని బాగా ప్రాచుర్యం పొందాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన.. అత్యవసర సేవల విభాగం, ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉంటూ.. మెరుగైన వైద్య సేవలు
అందిస్తూ.. మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ దంపతులకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట రామారావు, గోవిందమ్మ దంపతులు, కార్పొరేటర్ శీలంశెట్టి రమ, శీలంశెట్టి వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు మిక్కిలినేని నరేందర్, పలువురు ప్రజాప్రతినిధులు.. తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ యస్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ,రామారావు కుమారుడు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “TRR Ardho Accident Care Unit” హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న బీఆర్ యస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు.
సుడామాజి చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మంత్రి గారి వ్యక్తి గత పి. ఏ చిరుమామిళ్ళ రవి కిరణ్, మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి విరబద్రం, 51 వ డివిజన్ కార్పొరేటర్ శీలం శెట్టి రమ,నగర పార్టీ ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, 21వ డివిజన్ BRS పార్టీ ఇన్ చార్జి షేక్ ఉస్మాన్ పాల్గొన్నారు.
తల్లిదండ్రుల ఆనందం…
హోల్ సెల్ కూరగాయల వ్యాపారి తోటరామారావు కుమారుడు డాక్టర్ తోట లక్ష్మణ్ చే వైద్యంలో అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో కొత్తగా మరో హాస్పిటల్ ప్రారంభం అయింది …తన కుమారుణ్ణి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి డాక్టర్ ను చేసి కొత్తగా హాస్పటల్ పెట్టించడం పట్ల ఆ దంపతుల ఆనందంతో మురిసిపోయారు …తమ కుమారుడు పేదలకు వైద్యసేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వారు కోరుకుంటున్నారు … డాక్టర్ లక్ష్మణ్ మామ మాజీ కార్పొరేటర్ శీలం శెట్టి వీరభద్రం కూడా తన అల్లుడు పేషంట్లకు మంచి వైద్యం చేయడం ద్వారా పేరు తెచుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు …