Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహిళా కానిస్టేబుల్ ను కడతేర్చిన సోదరుడు.. కులాంతర వివాహమే కారణం!

  • ఇబ్రహీంపట్నంలో జనం చూస్తుండగానే వేటకొడవలితో దాడి
  • హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణి
  • డ్యూటీకి వెళుతుండగా నాగమణిని కారుతో ఢీ కొట్టి ఆపై హత్య

తల్లిదండ్రులు చేసిన పెళ్లి బంధాన్ని తెంచేసుకుని మళ్లీ కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన సోదరినే చంపేశాడు. డ్యూటీకి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీ కొట్టి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ దారుణం వివరాలు.. రాయపోలుకు చెందిన నాగమణి కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలోనే వివాహం కాగా పది నెలల క్రితమే విడాకులు తీసుకుంది.

నెల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుటుంబ పరువు పోయిందని నాగమణి సోదరుడు ఆవేశంతో రగిలిపోయాడు. డ్యూటికీ వెళ్లేందుకు బయలుదేరిన నాగమణిని కారుతో ఢీ కొట్టాడు. కిందపడ్డ నాగమణిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. జనమంతా చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, నాగమణి సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Related posts

గూగుల్ మాతృసంస్థలో యువతులపై వేధింపులు…సుందర్ పిచాయ్ కి లేఖ

Drukpadam

పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసు.. రాజస్థాన్‌లో దొరికిన కాలిపోయిన ఫోన్ భాగాలు, నిందితుల దుస్తులు

Ram Narayana

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి మెసేజ్ పంపిన సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి!

Ram Narayana

Leave a Comment