Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

 ఛత్తీస్ గఢ్ లో మరోసారి కాల్పుల మోత… 12 మంది మావోయిస్టుల మృతి

 అబూజ్ మడ్ అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్

భద్రతా బలగాలకు ఎదురుపడిన నక్సల్స్

మావోయిస్టులకు మరోసారి తీవ్ర నష్టం

కొనసాగుతున్న యాంటీ నక్సల్ ఆపరేషన్

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి భారీ నష్టం జరిగింది. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 

నారాయణపూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల్లో నేడు భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో, తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. 

ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటిదాకా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Related posts

చెత్తకుప్పలో బయటపడ్డ రూ.25 కోట్లు..!

Ram Narayana

ఫడ్నవిస్ తో విభేదాలపై స్పందించిన షిండే …మాది ఫెవికాల్ బంధమని వ్యాఖ్య …

Drukpadam

నీరవ్ మోదీ అన్నంత మాత్రాన ఆయనను సస్పెండ్ చేసేస్తారా?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

Leave a Comment