- ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం
- మోహన్ బాబు నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లు
- టీవీ9 రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి
- ఆసుపత్రిలో చేరిన రిపోర్టర్
- స్వయంగా కలిసి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
ఇటీవల ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం చెలరేగడం తెలిసిందే. ఈ క్రమంలో తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లపై మోహన్ బాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. టీవీ9 చానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ చేతిలోంచి మైక్ ను లాక్కున్న మోహన్ బాబు… ఆ మైక్ తో సదరు రిపోర్టర్ పై దాడి చేశారు.
గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.
ఆ రిపోర్టర్ కు క్షమాపణలు తెలియజేశారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులతోనూ మోహన్ బాబు మాట్లాడారు. ఆ రోజు తన నివాసంలో జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.