- అసెంబ్లీ ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజాప్రతినిధుల ప్రవేశంపై నిషేధం
- మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఇన్నర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు
- అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియో తీయరాదని మీడియాకు ఆదేశాల జారీ
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నుంచి పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఇన్నర్ లాబీలోకి మాజీ ప్రజాప్రతినిధుల ప్రవేశంపై నిషేధం విధించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఇన్నర్ లాబీలోకి నో ఎంట్రీ అంటూ బోర్డులు వెలిశాయి.
అలాగే మీడియాపై కూడా పలు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి వీడియో తీయరాదని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు విధించడం పట్ల మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీలోకి అనుమతించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.