Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రైతు భరోసా విధివిధానాలపై భట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కుస్తీ …

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది …కానీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైనా తమ హామీ నిలబెట్టుకోలేదనే విమర్శలు ఎదుర్కొంటుంది … దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు అయింది …ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేస్తుంది ..ఇప్పటికే దీనిపై చర్చించిన సబ్ కమిటీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ..తుదిరూపం ఇచ్చి తమ నివేదికను అందించనున్నది …విశ్వసనీయ సమాచారం మేరకు ప్రతి సీజన్ కు రూ 7500 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది … అదికూడా 7 ఎకరాల లోపా 10 ఎకరాల లోపా అనేదానిపై కుస్తీ పడుతుంది ..ప్రజాప్రతినిధులకు ,ఐఏఎస్ ,ఐపీఎస్ లకు భరోసా ఇవ్వకూడదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే సాలీనా రెండు సీజనల్ కు రైతులకు రైతు భరోసా అందించేందుకు సిద్ధం అవుతుంది… ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా.. కీలక మంత్రులు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా అందిస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందించింది. కాగా ఈ విధానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే వివిధ రకాల సందేహాలపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది. కాగా ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలను తీసుకొని.. రైతు భరోసా 7 నుంచి 10 ఎకరాల లోపు లిమిట్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

రైతు భరోసాపై ఖచ్చితమైన లిమిట్ పెట్టాలని చాలా మంది విశ్లేషకులు సూచించినట్లు తెలస్తుంది. అలాగే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సైతం రైతు భరోసా ఇవ్వకూడదని.. కేబినెట్ సబ్ కమిటీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. కాగా రైతు భరోసాపై కమిటీ అందించిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి.. రైతుభరోసా అమలుపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రభుత్వ హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకం కింద.. ప్రతి రైతుకు సీజన్ కు ఒక సారి ఎకరాకు రూ. 7500 ఇవ్వనున్నారు. ఇది రైతులకు ముందస్తు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

Related posts

కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలోనే 10 రోజులు ఉండాలి: యశోద ఆసుపత్రి వైద్యులు

Ram Narayana

బండి సంజయ్‌తో గ్యాప్ లేదు… ఈటల

Drukpadam

ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు..

Ram Narayana

Leave a Comment