ఇంతకీ నూతన సంవత్సర ఘడియలు ఏ దేశంలో ఎప్పుడు!
2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్,ఆస్ట్రేలియా

- భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకే కిరిబాటిలో కొత్త ఏడాది ప్రవేశం
- పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం కిరిబాటి
- ఆ తర్వాత టోంగా, సమోవా, ఫిజీ దీవుల్లో ఒకేసారి నూతన సంవత్సరం వేడుకలు
- కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా
- కొత్త ఏడాది చివరగా పలకరించేది బేకర్, హౌలాండ్ దీవులను
- ఇక్కడ రేపు సాయంత్రం 5.30 గంటలకు కొత్త సంవత్సరం వేడుకలు
మరికొన్ని గంటల్లో ఈ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. నూతన ఏడాదికి స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. అయితే, టైమ్ జోన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల ప్రజలు ఇప్పటికే కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం కిరిబాటి. కిరిబాటిలో అర్ధరాత్రి 12 గంటలైతే… భారత్‌లో మధ్యాహ్నం గం.3.30 అవుతుంది. ఆ తర్వాత ఒక గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్ లోని టోంగా, సమోవా, ఫిజీ దీవుల్లో ఒకేసారి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు.
పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు అన్నింటి కంటే ముందుగా ఇలా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో మొదట భానుడి కిరణాలు ఆ దేశాల మీద పడటమే దీనికి కారణం.
ఇక కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. కివీస్‌లోని అక్లాండ్, వెల్లింగ్టన్ తో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా నగరాలు మొదట నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతాయి.
కాగా, కొత్త సంవత్సరం చివరగా పలకరించేది బేకర్, హౌలాండ్ దీవులు. ఇక్కడ భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5.30 గంటలకు కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతాయి. భూగోళం అంచుల్లో ఉండే ద్వీప దేశాలివి.
- ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
- మనకంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న నేపాల్, బంగ్లాదేశ్
- రష్యాలో రెండు సార్లు కొత్త సంవత్సర వేడుకలు
కొత్త సంవత్సర వేడుకలకు యావత్ ప్రపంచం సిద్ధమయింది. మన దేశంలో కూడా పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. 2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.
మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాలో మన కంటే ఐదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
రేపు ఉదయం మనకు 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న…. పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
వెల్కమ్ 2025…. కళ్లు మిరుమిట్లు గొలిపేలా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ఆస్ట్రేలియా

పాతకు వీడ్కోలు పలుకుతూ, కొత్తకు స్వాగతం చెబుతూ… ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. మొదటగా పసిఫిక్ ద్వీపదేశాలు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. తాజాగా, ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం కూడా 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.
కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి. వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్ వద్దకు చేరుకుని నూతన సంవత్సర ఘడియలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తోటివారికి హ్యాపీ న్యూయర్ చెబుతూ 2025లోకి ప్రవేశించారు.
సిడ్నీ హార్బర్ వద్ద న్యూ ఇయర్ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.