జాతీయ వార్తలు

ముంబై- దుబాయ్ విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

 50 నిమిషాల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చిన విమానం..


ముంబై నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలోనే అత్యవసరంగా దిగింది. గత రాత్రి 8 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 50 నిమిషాల ప్రయాణం అనంతరం తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Related posts

ఫేస్‌బుక్ ప్రేమ.. యువకుడికి 13 గంటల నరకం చూపించిన యువతి కుటుంబం…

Ram Narayana

భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ కుమారుడు…

Ram Narayana

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు .. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Ram Narayana