జాతీయ వార్తలు

ముంబై- దుబాయ్ విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

 50 నిమిషాల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చిన విమానం..


ముంబై నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలోనే అత్యవసరంగా దిగింది. గత రాత్రి 8 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 50 నిమిషాల ప్రయాణం అనంతరం తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Related posts

ఆగస్టు 5 నుంచి అమెజాన్ లో ఆఫర్ల జాతర

Ram Narayana

నన్ను రాజు అనొద్దు.. ఆ భావనకే నేను వ్యతిరేకిని: రాహుల్ గాంధీ

Ram Narayana

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు… రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం…

Ram Narayana