జాతీయ వార్తలు

2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు …

2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు …

ఏకంగా 8 గంటలు సేవ్…బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాలంటే 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే గంట నుండి గంటన్నర ప్రమాాణమే. ఇంత తక్కువ సమయంలోనే రైలు ప్రయాణం ఉంటే… ఇదే త్వరలో జరగబోతోంది.
భారతదేశంలో ఐటీ పేరెత్తగానే ముందుగా గుర్తుకువచ్చేది బెంగళూరు, హైదరాబాద్ నగరాలే. ఈ రెండు దక్షిణాది నగరాలు ఐటీ రంగంలో అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ కంపనీలైన మైక్రో సాఫ్ట్, గూగుల్ వంటివే కాదు ఇన్పోసిస్, టెక్ మహింద్రా, టాటా కన్సల్టెన్సీ వంటి దేశీయ ఐటీ సంస్థలు కూడా ఈ రెండు నగరాల్లో కొలువై ఉన్నాయి. ఇలా ఐటీ హబ్ లుగా మారిన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఐటీ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగుల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇక ఇతర రంగాల్లోనూ హైదరాబాద్, బెంగళూరు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక తెలుగు, కన్నడ ప్రజల మధ్య విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజకీయ, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో పాటు ఐటీ ఉద్యోగులు, సామాన్యులు తరచూ హైదరాబాద్-బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటివారికి కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య తొందరగా రాకపోకలు సాగించాలంటే విమాన ప్రయాణమే దిక్కు. రైలు లేదా బస్సులో వెళ్ళాలంటే 10 నుండి 15 గంటల సమయం పడుతుంది. అంటే రోజులో సగం ప్రయాణానికే సరిపోతుంది… రానుపోను చూసుకుంటే దాదాపు ఒక్కరోజు ప్రయాణంలోనే గడిచిపోతుంది. విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది… నిత్యం ప్రయాణించే సామాన్య ఉద్యోగులు, ప్రజలు ఇంత ఖర్చు భరించలేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు మధ్య తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే ప్రయాణం సాగించేలా బుల్లెట్ ట్రైన్ ను తీసుకువస్తోంది.
బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ :

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైస్పీడ్ వందే భారత్ రైళ్ళను తీసుకువచ్చింది. సాధారణ రైళ్ల కంటే వేగంగా ఈ వందే భారత్ ట్రైన్స్ ప్రయాణిస్తాయి. అయితే ఇప్పుడు ఈ వందేభారత్ కంటే వేగంగా పరుగుతీసే బుల్లెట్ ట్రైన్ లను భారతీయులను పరిచయం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ (హై స్పీడ్ రైల్ కారిడార్) ప్రాజెక్టును చేపట్టారు.

అయితే హైదరాబాద్-బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇది అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య కేవలం 2 గంటల్లోనే ప్రయాణం సాగుతుంది… అంటే ఇంచుమించు విమాన ప్రయాణ సమయంలోనే బుల్లెట్ ట్రైన్ గమ్యానికి చేరుకోవచ్చు.

హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య దూరం 600 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అంటే బుల్లెట్ ట్రైన్ గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుందన్నమాట. ఇంతటి స్పీడ్ కు తగ్గట్లుగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు… కాబట్టి హైదరాబాద్, బెంగళూరు బుల్లెట్ ట్రైన్ 2041 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ రెడీ చేసింది నేషనల్ రైల్ ప్లాన్(NRP).

ఈ హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా సాగనుంది. హైదరాబాద్-మహబూబ్ నగర్-గద్వాల-కర్నూల్-అనంతపూర్-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణం సాగుతుంది. ఇలా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రాలకు ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ప్రయోజకం కలుగుతుంది.

బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదిత నగరాల పూర్తి జాబితా :

  1. ముంబై-అహ్మదాబాద్ – 508 కి.మీ మార్గం ‌- 2 గంటల్లోపే ప్రయాణం ( 2028 నాటికి పూర్తి)
  2. డిల్లి – అహ్మదాబాద్ – 886 కి.మీ మార్గం ‌- 2‌-3 గంటల ప్రయాణం (2031 నాటికి పూర్తి)
  3. డిల్లి – వారణాసి -865 కి.మీ మార్గం – 2‌-3 గంటల ప్రయాణం (2031 నాటికి పూర్)
  4. వారణాసి – హౌరా – 711 కి.మీ మార్గం – 2 గంటల ప్రయాణం (2031 నాటికి పూర్తి)
  5. హైదరాబాద్ – బెంగళూరు – 618 కి.మీ మార్గం – 2 గంటల్లోపే ప్రయాణం (2041 నాటికి పూర్తి)
  6. నాగ్ పూర్ – వారణాసి -855 కి.మీ మార్గం – 2‌-3 గంటల ప్రయాణం (2041 నాటికి పూర్తి)
  7. చెన్నై – మైసూరు – 435 కి.మీ మార్గం – 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)
  8. డిల్లి – అమృత్ సర్ – 480 కి.మీ మార్గం – 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)
  9. అమృత్ సర్ – జమ్మూ – 190 కి.మీ మార్గం – అరగంట నుండి గంటలోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)
  10. ముంబై – హైదరాబాద్ – 711 కి.మీ మార్గం – 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)
  11. ముంబై – నాగ్ పూర్ -736 కి.మీ మార్గం – 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)
  12. పాట్నా – గౌహతి – 850 కి.మీ మార్గం – 2‌-3 గంటల ప్రయాణం (2051 నాటికి పూర్తి)

Related posts

పహల్గామ్ బాధితులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Ram Narayana

నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు… ప్రకటించిన క్రికెటర్

Ram Narayana

పొరపాటున తాకిన దళితుడు.. ముఖంపై మానవ విసర్జితాలు చల్లి వికృతానందం

Ram Narayana