తెలంగాణ వార్తలు

తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి!

  • టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలు
  • ఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు
  • మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు  

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ ఆశించారు. కానీ ఈ ప్రమాదం చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. 

టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో వీరి మృతదేహాలను గుర్తించారు. అత్యాధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాలను గుర్తించడం జరిగింది. మృతదేహాల గుర్తింపులో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది. మృతి చెందిన వారిలో ఇద్దరు ఇంజినీర్లు కాగా, మిగిలిన ఆరుగురు కార్మికులు. టన్నెల్ లో చిక్కుకున్న అందరూ మరణించారని నిర్ధారణ కావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఏడు రోజుల క్రితం గత శనివారం టన్నెల్ లో ప్రమాదం చోటుచేసుకుంది.

Related posts

బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

Drukpadam

మూగవోయిన కంచుకంఠం …అందెశ్రీ ఇక లేరు

Ram Narayana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

Ram Narayana