జాతీయ వార్తలు

ఒక బైక్… రెండు హెల్మెట్లు.. కేంద్రం కీలక నిర్ణయం!

  • ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
  • ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ఆదేశాలు
  • ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

దేశ వ్యాప్తంగా ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ద్విచక్ర వాహన విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు.

మంత్రి ప్రకటనకు టూ వీలర్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్‌ఎంఏ) సంపూర్ణ మద్దతు తెలియజేసింది. తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన విక్రేతలు నూతన బైక్ కొనుగోలు సమయంలోనే రెండు హెల్మెట్‌లను విక్రయించనున్నారు. 

Related posts

ముంబై-న్యూయార్క్ విమానం వెనక్కి.. కారణం ఇదే!

Ram Narayana

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఏడాది రూ. 40 లక్షల ఖర్చు!

Ram Narayana

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

Ram Narayana