Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో పీసీసీ పదవి చిచ్చు కోమటిరెడ్డి ఫైర్ …ముఖ్యనేతలు పార్టీకి గుడ్ బై…

కాంగ్రెస్ లో పీసీసీ పదవి చిచ్చు కోమటిరెడ్డి ఫైర్ …ముఖ్యనేతలు పార్టీకి గుడ్ బై
– మాణిక్యం ఠాకూర్ పై మండిపడ్డ కోమటి రెడ్డి; పీసీసీ పదవి అమ్ముకున్నాడని ధ్వజం
-ఆధారాలతో సహా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాకు అందజేస్తా
-పార్టీ మారిన వాళ్లకు పదవి ఇవ్వడం ఏమిటి ?
-కాంగ్రెస్ కార్యాలయం టీటీడీపీ కార్యాలంగా మారింది
-గాంధీ భవన్ మెట్లు ఎక్కనని భీష్మా ప్రతిజ్న
-కార్యకర్తలతో చేర్చించి భవిష్యత్ కార్యాచరణ
– ఇబ్రహీం పట్నం నుంచి భవనగిరి వరకు పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక పార్టీలో చిచ్చుకు దారితీసింది …. పదవిని ఆశించి భంగపడ్డ భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు……. పార్టీలోని ముఖ్యనేతలు అంతా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర ఫ్రంటల్ ఆర్గనేజేషన్స్ అన్ని దాదాపు 90 శాతం మంది టీపీసీసీ చీఫ్ గా తనపేరునే ప్రతిపాదించారని అన్నారు. అయినప్పటికీ తనకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

పీసీసీ ఎంపిక పూర్తీ అయిన అనంతరం ఢిల్లీ నుంచి హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి విమానాశ్రయంలోనే అధ్యక్షుడి ఎంపికపై అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. ఓటుకు నోటు లాగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పదవిని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.పార్టీ మారే వాళ్లకు , పదవి ఇవ్వడం ఏమిటని ఆయన రేవంత్ నియామకంపై విరుచుకపడ్డారు… పదవి అమ్ముకున్న ఆధారాలు తనదగ్గర ఉన్నాయని వాటి వివరాలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధ్యక్షురాలు సోనియా గాంధీ కి అందజేస్తానని అన్నారు. చంద్రబాబు సూచనల మేరకే రేవంత్ ఎంపిక జరిగిందని ధ్వజమెత్తారు . కాంగ్రెస్ కార్యాలయం టీటీడీపీ కార్యాలయంగా మారనున్నది ,ఇకనుంచి తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని భీష్మ ప్రతిజ్న చేశారు. తనను కలిసేందుకు కొత్తగా నియమితులైన టీపీసీసీ సభ్యులెవరూ ప్రయత్నం చేయవద్దని ఖరాకండిగా చెప్పారు . రేవంత్ పార్టీలోని సీనియర్లను , అసమ్మతి వాదులను కలుస్తున్న సందర్భంగా కోమటి రెడ్డి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేవంత్ తనను కలవద్దని చెప్పకనే చెప్పారు … తమ కార్యకర్తల హృదయాలుకు గాయాలు అయ్యాయని ,33 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న తనకే పార్టీలో న్యాయం జరగలేదని తమకు పార్టీ ఎలా న్యాయం చేస్తుందని భావిస్తున్నారని అన్నారు . తన భవిష్యత్ ను తన కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు. తాను ఇబ్రహీం పట్నం నుంచి భవనగిరి వరకు తన పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని, కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకుంటానని అనంతరమే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ని టీపీసీసీ చీఫ్ గా నియమిచాడంపై కాంగ్రెస్ లో ముసలం మొదలైంది.సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి , మర్రి శశిధర్ రెడ్డిలు పార్టీకి గుడ్బై చెప్పారు…. మరికొందరు రాజీనామాలకు సిద్దపడుతునట్లు తెలుస్తుంది.

Marri Sasidhar Reddy quits as TPCC Election Coordination Committee Chairman

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. నూతన సమన్వయ కమిటీ ఏర్పాటులో టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. ఏది ఎలాగున్నా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఎప్పటికీ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని ఉద్ఘాటించారు.

కాగా, రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించే సాహసం చేయనప్పటికీ, తమ అసంతృప్తిని మాత్రం ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతున్నారు.

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పార్టీకి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించిన కాసేపటికే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి గత రాత్రి లేఖ పంపారు. తెలంగాణ పార్టీ చీఫ్‌గా నియమితులైన తర్వాత గత రాత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ సీటును తనకు ఇవ్వాలని చెప్పిందే లక్ష్మారెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆయన తనకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

అనేకమంది రేవంత్ నియమాకంపట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బాటలో మరికొందరు పయనించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్లు రేవంత్ నియామకంపై మండి పడుతున్నారు.

Related posts

జగన్, పొంగులేటి భేటీ …వ్యాపారమా …? రాజకీయమా …??

Drukpadam

రూట్ మార్చి సైకిల్ ఎక్కిన సీఎల్పీ నేత భట్టి

Drukpadam

తుమ్మల పై మరల ట్రోలింగ్…!

Drukpadam

Leave a Comment