Puvvada Ajay Kumar
ఖమ్మం వార్తలు

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

  • మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు
  • 25వసంతాల రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చెయ్యాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మమత హాస్పిటల్ క్యాంపస్లోని ఆయన ఇంటికి వద్ద ఖమ్మం నియోజకవర్గం బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ సభను విజయవంతం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కార్యకర్తలను కోరారు. రజతోత్సవ సభకు ఖమ్మం నియోజక వర్గం నుండి 10, 000 వేల మందిని తరలించి జయప్రదం చేయాలన్నారు.సభ అనంతరం ఆన్ లైన్  మెంబర్షిప్ కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ 2000వ సంవత్సరంలో పిడికెడు మందితో పెట్టిన పార్టీ 2025 నాటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న పార్టీ తమదేనన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, 2014 నాటికి తెలంగాణ సిద్దించే వరకు సాగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రాజెక్టులు, నిరుద్యోగుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తాగు నీటి కోసం ఎన్నో ఇబ్బంది పడ్డామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీరు,తాగు నీరు, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ పథకంతో తాగు నీరు, మిషన్ కాకతీయతో చెరువులు తవ్వించి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు కట్టించి, చెరువులు నింపి, దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేశారని కొనియాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన పనులు, పథకాలు కాన రాకుండా చేరిపేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆటకేక్కాయని, మహిళలకు మహాలక్షి పథకం,పెంచాల్సిన పెంక్షన్లు,కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆడ పిల్లలకు స్కూటీ ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మసీద్ హిమాంలకు,మౌజంలకు జీతాలు, పురోహితులుకు దూప దీపా నైవేద్యాలు లేవని, రైతులకు రుణ మాపి అంతా చేసేసామని చేతులు దులుపులున్నారని విమర్శించారు. రైతు భరోసా కూడా కొందరికే ఇచ్చారని పువ్వాడ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాధ పాలెం మండల అధ్యక్షుడు వీరునాయక్, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమ్మం కార్పోరేషన్ పార్టీ ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యుటీ ప్లోర్ లీడర్ మక్బుల్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, జేఏసీ నేతలు తిరుమల రావు, సుగుణ రావు, మెంతుల శ్రీశైలం, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …

Ram Narayana

ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు తప్పవు..

Ram Narayana

జిల్లాలో పకడ్బందిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

Ram Narayana