ఆఫ్ బీట్ వార్తలు

ఏఐ మాయ.. ఆశ్చర్యపరిచే సన్నివేశం …!


అమూల్ యాడ్ లో కనిపించే చిన్నారి బొమ్మ, ఎయిర్ ఇండియా మస్కట్ మహారాజా, పార్లే-జి బిస్కట్ పాపాయి.. గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ బొమ్మలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఓ నెటిజన్ రూపమిచ్చాడు. కృత్రిమ మేధ సాయంతో ఆ బొమ్మలతో ఓ వీడియో రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమూల్ బేబీ చిప్స్ తినడం, నిర్మా గర్ల్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. 

ఎయిర్ ఇండియా మహారాజా తన ప్రత్యేకమైన స్టైల్ లో చిరునవ్వు నవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పార్లే-జి బిస్కెట్ పాప బిస్కెట్ల మధ్య కూర్చుని నవ్వుతుండడం ఆకట్టుకుంటోంది. తొంభైలలో విశేష ప్రాచుర్యం పొందిన ప్రకటనలకు సంబంధించిన ఈ బొమ్మలను చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related posts

దీపావళి కానుకంటే ఇది.. 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు పంచిన ఓనర్!

Ram Narayana

ల‌క్కున్నోడు.. బ్రిట‌న్ వ్య‌క్తికి రూ.1,800 కోట్ల జాక్‌పాట్‌!

Ram Narayana

కొత్త కారుకు గుడిలో పూజలు.. స్టార్ట్ చేయగానే ప్రమాదం..!

Ram Narayana