NIA
జాతీయ వార్తలు

ఉగ్రవాద దాడిపై ఎన్ఐఏ చేతికి కీలక ఆధారం

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు ప్రారంభించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ ) కు కీలక ఆధారం లభించింది. ఈ దర్యాప్తులో బైసారన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం రీల్స్ చిత్రీకరించిన స్థానిక వీడియోగ్రాఫర్ కీలక సాక్షిగా నిలిచాడు. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో, స్థానిక ఫోటోగ్రాఫర్ దృశ్యాలను చిత్రీకరించాడని అధికారులు తెలిపారు. “కాల్పులు ప్రారంభమైనప్పుడు, ఈ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెత్తాడు. బుల్లెట్ల నుండి తప్పించుకునేందుకు చెట్టుపై కూర్చున్నాడు. కానీ, దానితో పాటు సంఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీస్తూ ఉన్నాడు, మొత్తం ఉగ్రవాద దాడిని రికార్డ్ చేశాడు” అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఎన్ఐఏ ఈ వీడియోగ్రాఫర్‌ను ప్రశ్నించి, అతను చిత్రీకరించిన వీడియోలను విశ్లేషిస్తోంది. ఈ వీడియోల ద్వారా ఉగ్రవాదులను, వారికీ సహాయం చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

ఢిల్లీ కొత్త సీఎం అతిశీకి నగలు, ఆస్తులు లేకున్నా కోటీశ్వరురాలే!

Ram Narayana

ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడు? ఎక్కడ?

Ram Narayana

ఈపీఎస్ పింఛనుదారులకు గుడ్ న్యూస్.. కనీస పింఛను రూ. 2500కు పెంపు యోచన!

Ram Narayana