మోహన్ భగత్ మతసామరస్యం… అసదుద్దీన్ ఒవైసి మండిపాటు
ప్రజాస్వామ్యంలో ఏ మతం ఆధిపత్యం ఆమోదయోగ్యం కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్
మత సామరస్యంపై అభిప్రాయాల వెల్లడి
భారతీయత ఒక్కటే ముఖ్యమని వ్యాఖ్యలు
ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచే వచ్చిందన్న ఒవైసి
ముస్లిం వ్యతిరేకులకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉంది
నేరస్థులకు అధికార పార్టీ మద్దతిస్తోందనే విషయం అందరికీ తెలుసు
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఏమతమైన ఆధిపత్యం ప్రదర్శించడం ఆమోదయోగ్యం కాదని .దేశం లో అన్ని మాటలమధ్య ఐక్యత ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దీనిపై ఎం ఐ ఎం నేత హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా స్పందించారు. అసలు ముస్లింలమీద ద్యేశభావం రెచ్చగొడుతుంది మీరు …. దానికి బీజేపీ ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. మోహన్ భగత్ మాటలకూ చేతలకు ఎంతో తేడా ఉందని మండిపడ్డారు….వారి అభిప్రాయాల్లోని ….
మోహన్ భగత్ …..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన ముస్లిం విభాగం. ఇక ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత సామరస్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ… ఏ మతం అయినా ఆధిపత్యం ప్రదర్శించడం భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. జాతీయతకు ప్రాతిపదిక ఐక్యతేనని, పూర్వీకుల నుంచి అందిపుచ్చుకోవాల్సిన ఘనత అదేనని స్పష్టం చేశారు. దేశంలో ఆధిపత్యం అంటూ ఉంటే అది భారతీయత మాత్రమే అయ్యుండాలని, హిందూ మతమో, ముస్లిం మతమో పైచేయిగా ఉండడం సరికాదని మోహన్ భగవత్ వివరించారు.
కొందరు వ్యక్తులపై సామూహికంగా దాడి చేసి హతమార్చిన ఘటనలపై స్పందిస్తూ, అలాంటి హింసాత్మక ఘటనలు హిందుత్వకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. గోవు మనకు పవిత్రం కావొచ్చేమో కానీ, ఇలాంటి మూకదాడులకు హిందుత్వంలో తావులేదని అన్నారు. ఇక్కడ ఓ ముస్లిం నివసించరాదని ఓ హిందువు చెప్పాడంటే అతడు నిజమైన హిందువు కానట్టేనని పేర్కొన్నారు.
అసదుద్దీన్ ఒవైసి ….
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషభావం హిందుత్వ నుంచి వచ్చిందని ఆయన అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేరస్థులకు హిందూ ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. ముస్లింలపై దాడులకు పాల్పడేవారు హిందువులు కారని మోహన్ భగవత్ అంటున్నారని… అయితే ముస్లింలకు వ్యతిరేకంగా నేరాలు చేస్తున్న వారికి అధికార పార్టీ మద్దతు ఇస్తోందనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.
గో రక్షకుల పేరుతో ఎందరో ముస్లింలపై దాడులు జరిగాయని ఒవైసీ అన్నారు. 2015లో మొహమ్మద్ అఖ్లఖ్ హత్య, 2017లో పెహ్లూ ఖాన్ పై దాడి, 2018లో అలీముద్దీన్ మృతి వంటివి ఈ దారుణాలకు కొన్ని ఉదాహరణలను చెప్పారు. అలీముద్దీన్ ను చంపిన నేరస్థులను ఒక కేంద్ర మంత్రి పూలదండలతో సత్కరించారని మండిపడ్డారు. ఈ మేరకు ఒవైసీ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
మరోవైపు మోహన్ భగవత్ మాట్లాడూతూ భారత్ లో ఇస్లాం ప్రమాదంలో చిక్కుకుందని ముస్లింలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. హిందువులైనా, ముస్లింలైనా భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు.