ఖమ్మం వార్తలు

ఏదులాపురం మున్సిపాలిటీని టాప్ ఫైవ్ లో నిలబెడతా ….మంత్రి పొంగులేటి

ఏదులాపురం మున్సిపాలిటీని టాప్ ఫైవ్ లో నిలబెడతా ….మంత్రి పొంగులేటి

  • రానున్న రోజుల్లో దేశంలో టాప్ ఫైవ్ లో మున్సిపాలిటీలలో ఏదులాపురం ఉంటుంది..
  • ప్రజలు అడిగిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
  • చుట్టుపక్కల ఎక్కడా లేని పార్క్ ని రాబోయే రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం..
  • మీరు ఆశించిన దానికంటే ఎక్కువే అభివృద్ధి చేస్తా..
  • మీ ఆశీస్సులతో నేను ఈస్థానంలో ఉన్న,అది ఎప్పటికి మర్చిపోను..
  • అందరి సలహాలు,సూచనలతో ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేసాం..
  • ఏదులాపురం మున్సిపాలిటీని టాప్ ఫైవ్ లో నిలబెడతానని రాష్ట్ర రెవిన్యూ ,గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు …ఆదివారం కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి అధికారులతో కలిసి పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు …ఈ సందర్భంబ కరుణగిరిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధిపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని రానున్నరోజుల్లో దేశంలోనే టాప్ ఫైవ్ మున్సిపాల్టీలలో ఒకటిగా దీన్ని నిలబెడతానని అన్నారు …ప్రజల ఇచ్చిన అవకాశాన్ని , నమ్మకాన్ని వమ్ముచేయనని ప్రజల మేలు ,ఈ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి పేర్కొన్నారు .. అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు …. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి జరుగుతుందనిన్నారు ..

అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఏదులాపురం మున్సిపల్ ప్రాంతం నాయుడుపేట జంక్షన్ వద్ద రూ. 4 కోట్ల రూపాయలతో ఖమ్మం – మహబూబాబాద్ నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు, పెద్దతండ గ్రామంలో ఖమ్మం – సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి శ్రీ యోగానంద సాయి ఆశ్రమం చల్లపల్లి గార్డెన్ వరకు రూ. కోటీ 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గుదిమల్ల వాటర్ ట్యాంక్ నుండి బోడగుట్ట డొంక వరకు రూ. కోటి 21 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేపట్టామని అన్నారు. అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ. యాకోబ్, ఇఇ వి. యుగంధర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం నగరానికి నాలుగు దిక్కులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు… మంత్రి తుమ్మల

Ram Narayana

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి…

Ram Narayana

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా … బీజేపీ నేత పొంగులేటి ….!

Drukpadam