ఆంధ్రప్రదేశ్

తల్లికి అస్వస్థత… కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలోనే హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరిన పవన్ కల్యాణ్

  • చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్
  • తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు పవన్ కు సమాచారం
  • సీఎంకు పరిస్థితిని తెలిపి… హైదరాబాద్ కు బయల్దేరిన పవన్

ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సమావేశం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు పవన్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపారు. పరిస్థితిని వివరించి, ఆయన అనుమతి తీసుకున్న అనంతరం పవన్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు. పవన్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన మంత్రులతో కేబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగింది. పలు కీలకమైన పాలనాంశాలు, హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

Related posts

‘ఇంటింటికి బీజేపీ’కి దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్ కు అధిష్ఠానం పిలుపు!

Drukpadam

మరో వివాదంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్…

Drukpadam

తనను కాపాడిన మిత్రుడి దగ్గరికి వెళ్లేందుకు పక్షి ఆరాటం..హృదయాలను కదిలించే సంఘటన !

Drukpadam