Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఆశల పల్లకిలో తెలుగు ఎంపీలు…

నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఆశల పల్లకిలో తెలుగు ఎంపీలు
-ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ఆశావహులు
-తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఒక్క కిషన్ రెడ్డికే చోటు
-హామీ ఇచ్చినా టీజీ వెంకటేశ్‌కు ఇప్పటి వరకు రాని పిలుపు

కేంద్ర కేబినెట్‌ను నేడు విస్తరించనున్న నేపథ్యంలో మొత్తం 20 మందికి అవకాశం దక్కుతుందని తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రము నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి ఎక్కువమందిని తీసుకోబోతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా కు కాబినెట్ లో బెర్త్ ఖాయం . రాజస్థాన్ , బీహార్ , పంజాబ్ , బెంగాల్ రాష్ట్రాల నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కనున్నది . మిత్రపక్షాలకు కూడా సముచిత స్తానం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నది . అందువల్ల జేడీయూ , ఎల్జేపీ తదితర పార్టీ లనుంచి మంత్రి వర్గంలో చేరబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం ఏడుగురు లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగువాడైన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో కలుపుకుంటే మొత్తం 8 మంది తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ కు చెందిన ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి లభించింది. ఈసరి విస్తరణలో ధర్మపురి అరవింద్ లేదా సోయం బాబురావు లలో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందని భావించారు కానీ వారికీ ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు . అయితే ఆదిలాబాద్ ఎంపీ బాబురావు కు గిరిజన కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఆయన ఢిల్లీ లోనే ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతుంది. కానీ బీజేపీ వర్గాలు మాత్రం బాబురావు వేరే పనులమీద ఢిల్లీలో ఉన్నారని మంత్రి వర్గ విస్తరణకు బాబురావు ఢిల్లీ లో ఉండటానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.

ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరికి కేబినెట్ బెర్తులు దక్కొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీలో చేరినప్పుడు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్న కర్నూలు నేత టీజీ వెంకటేశ్‌కు రాత్రి వరకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఇక ఆశలు లేనట్టే. సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వేర్వేరు పనుల నిమిత్తం ఢిల్లీలోనే ఉన్నారు.

ఇక, ఏపీలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఆ రాష్ట్రానికి ఎలాంటి పదవులు దక్కకపోవచ్చు. కేబినెట్‌లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలనుకుంటే కనుక సోయం బాపూరావుకు అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనకు కూడా అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాకపోవడం గమనార్హం.

జివిఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన కీలక నేతగా ఉన్నారు. అందువల్ల సీనియర్ నిబద్దత గల జివిఎల్ కు అవకాశం ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి.

Related posts

సానుభూతి కోసమే ఈటల చిల్లర ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి గంగుల!

Drukpadam

ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన విజయం: సోము వీర్రాజు

Drukpadam

ఎన్నికల సంఘమా? ఎన్నికల “కమిషన్ “నా ? రాహుల్ విమర్శ

Drukpadam

Leave a Comment