Rama Devi
తెలుగు రాష్ట్రాలు

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి .. స్పృహ కోల్పోయిన రమాదేవి

  • పురుషోత్తపట్నంలో ఆలయ భూముల అంశంపై ఘర్షణ
  • ఆలయ భూముల్లో ఆక్రమణలను ఈవో అడ్డుకోవడంతో గ్రామస్థుల దాడి
  • దాడిలో స్పృహ కోల్పోయిన మహిళా అధికారి
  • భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స
  • హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని ఆక్రమణదారులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై కొందరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న ఈవో రమాదేవి, ఇతర ఆలయ సిబ్బందితో కలిసి మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణదారులకు, ఆలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలోనే ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య…

Ram Narayana

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Ram Narayana

గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ

Ram Narayana