Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోనియా అప్పడు బలిదేవత ఇప్పుడు తెలంగాణ తల్లి .. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం

సోనియా అప్పడు బలిదేవత ఇప్పుడు తెలంగాణ తల్లి .. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం
-చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు
-గతంలో సోనియాను బలి దేవత అన్నారు
-అది టీపీసీసీ కాదు.. టీడీపీసీసీ
-రేవంత్ కు ఇంకా టీడీపీ వాసనలు పోలేదు
-ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు
-తెలంగాణ లో పాదయాత్రల సీజన్ రాబోతుంది మంచిదే ఆరోగ్యాలు బాగుంటాయి

పీసీసీ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు….. సోనియా ని అప్పడు బలిదేవత అని ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారు…. చంద్రబాబు ను తెలంగాణ తండ్రి అంటాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు టీడీపీ వాసనలు ఇంకా పోలేదని , అది టీపీసీసీ కాదు టీడీపీసీసీ అని ఎద్దేవా చేశారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ నీతులు వల్లించడం హాస్యాస్పందంగా ఉందని ధ్వజమెత్తారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సోనియాను బలిదేవత అని రేవంత్ అన్నారని… ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని… రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ కు ఇంకా టీడీపీ వాసనలు పోలేదని విమర్శించారు. అది టీపీసీసీ కాదని… తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్ కమిటీ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అంటున్నారని… నువ్వు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చావు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా పార్టీ మారారని… ఆయనను కూడా రాళ్లతో కొట్టాలా? అని ప్రశ్నించారు. చిన్న పదవి రాగానే రేవంత్ పెద్ద బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో పాదయాత్రల సీజన్ రాబోతోందని… పాదయాత్రలు చేయండి, ఆరోగ్యం కూడా బాగుంటుందని విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ పల్లెల్లో ఎలాంటి అభివృద్ది జరిగిందో బండి సంజయ్ పాదయాత్రలో చూడాలని అన్నారు. తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.

Related posts

సోనియా గాంధీపై ఒవైసీ విమర్శలు…

Drukpadam

ఏక్‌నాథ్ షిండేనే మ‌హారాష్ట్ర సీఎం!.. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

‘పప్పు’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన…

Drukpadam

Leave a Comment