Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల పట్టు – మరింత ముదిరిన జలజగడం…

రెండు తెలుగు రాష్ట్రాల పట్టు – మరింత ముదిరిన జలజగడం
-రేపు జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా
-ఏపీ, తెలంగాణ జలవివాదాలు రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం
-ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ
-త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా వేయాలని వినతి
-అజెండాలో తమ అంశాలు లేవని ఆరోపణ

అంతర్ రాష్ట్ర , అంతర్ జాతీయ జలసమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నన్ని తగాదాలు మరెక్కడా కనిపించడంలేదు . చివరికి మన దాయాది దేశం పాకిస్తాన్ తో కూడా రావిబియస్ నది జలాల విషయంలో తగాదాలు ఉన్నాయి. కానీ ఇంతటి తీవ్రంగా లేవు . నిన్నమొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రాలు విడిపోయి కలిసి ఉండాలని భావించిన సమస్యలు వారిని కలవనివ్వడంలేదు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికీ ముఖ్యం . దేనికైనా ఒక పరిస్కారం ఉంటుంది దానికోసం ఇరురాష్ట్రాల ప్రయత్నాలు చేయాలి కానీ రెచ్చగొట్టుకోవడం వాళ్ళ ఉపయోగం లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కృష్ణ నది పై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంది . దానిలో పారె నీటి ఆధారంగా నీటిపంపకాలు ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఉండాలి … దీనికోసం పరస్పరం దెబ్బలాడుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు .కేంద్రం రాజకీయాలు పక్కన బెట్టి రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిస్కారం చేయాలి . రాజకీయకోణంలో చేస్తే తగాదాలు అంత తేలిగ్గా చల్లారవు.

ఏపీతో జలవివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేఆర్ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, రేపు జరగాల్సిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తామని కేఆర్ఎంబీ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు మరింత ముదిరిన నేపథ్యంలో, ఈ కీలక భేటీ వాయిదా పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ అజెండాలో తమకు సంబంధించిన అంశాలు లేవని, తమ అంశాలతో ఈ నెల 20 తర్వాత సమావేశం నిర్వహించాలని కోరింది. విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు.

Related posts

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

Drukpadam

కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీలో షర్మిల హల్చల్ …అరెస్ట్…

Drukpadam

భయపడితే కోలుకోలేని దెబ్బ తింటాం…చంద్రబాబు

Drukpadam

Leave a Comment