జాతీయ వార్తలు

ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం…

దేశరాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చినీయాంశంగా మారింది …దీనిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి…అసలు ఏమి జరిగి ఉండవచ్చుననే కోణంలో పరిశీలకులు ఆరాతీస్తున్నారు …తనకు ఆరోగ్యం సరిగాలేదని అందువల్లనే రాజీనామా చేస్తున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు . ఆయన రాజీనామాను వెంటనే రాష్ట్రపతి ఆమోదించడం ,కేంద్ర హోమ్ శాఖకు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి…ఇది దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది …

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు సంతకం చేసి లేఖను హోంశాఖకు పంపించారు. కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్ ఖడ్ రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు.

తొలిరోజు కార్యకలాపాలు ముగిసి సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత ధన్ ఖడ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. కాగా, ఉపరాష్ట్రపతితో పాటు పలు పదవులు నిర్వర్తించిన జగదీప్ ధన్ ఖడ్ దేశానికి ఎంతో సేవలందించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

Related posts

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలోకి వెళ్లిపోయిన కుటుంబం..

Ram Narayana

అసోంలోని ఆ గ్రామమంతా ఒకే కుటుంబం… 1200 మంది ఓటర్లు ఉన్నారు!

Ram Narayana

హిమాచల్‌లో భారీ వర్షాలు..అతలాకుతలమైన జనజీవనం

Ram Narayana