తెలంగాణ రాజకీయ వార్తలు ..

ముఖ్యమంత్రి పదవి ఆశించాను .. డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగా ఉన్నా… భట్టి

తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మాట నిజమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సీఎల్పీ లీడర్ గా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానని చెప్పారు. కానీ, పార్టీ హైకమాండ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిందని… ఈ పదవితో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు.ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు…

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవమేనని భట్టి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని… కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు రాలేవని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదనే వార్తలపై ఆయన స్పందిస్తూ… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఎలా కట్టాలో ఏపీ ప్రభుత్వానికి తెలిస్తే… ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో తమకు తెలుసని భట్టి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో పెడతామని… అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని చెప్పారు.

Related posts

ఆందోల్ నుంచి బాబుమోహన్‌కే టిక్కెట్… 35 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల…

Ram Narayana

కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలపై తుమ్మల భగ్గు భగ్గు …తన ఓటమిలో కేటీఆర్ పాత్ర అంటూ బిగ్ బాంబు ..!

Ram Narayana

తీన్మార్ మల్లన్న మా పార్టీనా, కాదా నిర్ణయించుకోవాలి: సీతక్క ఆగ్రహం!

Ram Narayana