Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇది మైసూరా రాజకీయం …మరోసారి గ్రేటర్ రాయలసీమ ప్రస్తావన…

ఇది మైసూరా రాజకీయం …మరోసారి గ్రేటర్ రాయలసీమ ప్రస్తావన…
-కేంద్ర గెజిట్ గ్రేటర్ రాయలసీమకు గొడ్డలిపెట్టన్న మైసూరా
-జల వివాదంపై చర్చించుకోవడానికి భేషజాలెందుకు? ప్రశ్న
-ఇరు రాష్ట్రాలు గొడవ పడి అధికారాన్ని కేంద్రానికి అప్పగించాయి విమర్శ
-రాయలసీమకూ ఓ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదున్న మైసూరా

మైసూరారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు …. రాజకీయాల్లో ఆరితేరిన కురువృద్ధుడు … తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాలమధ్య జరుగుతున్న జలవివాదంపై స్పందించారు…. హైద్రాబాద్ లో మీడియా సవవేశం పెట్టి గ్రేటర్ రాయలసీమ ఉంటె రాయలసీమకు నీటి కష్టాలు వచ్చేవి కావని ఒక థీరీని చెప్పారు. అప్పుడు గ్రేటర్ రాయలసీమ వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతలు ప్రాజెక్టు కడితే మిగతా వాళ్ళు అంగీకరిస్తారా ? ఇదెక్కడ సూత్రమే ఆయన వివరించాలి … ఆయన కు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ తోపాటు ,తెలంగాణా లోని కేసీఆర్ సర్కారుపై కోపం ఉన్నట్లు అయన మీడియా సమావేశం అర్థం అయ్యేలా వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలవివాదంపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఘర్షణ పడి అధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేశాయని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి గొడ్డలిపెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి కూడా ఓ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తి ఉండేది కాదన్నారు. కేంద్ర గెజిట్ వల్ల హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరు రావడం ఇక కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. జల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవడానికి భేషజాలెందుకని ప్రశ్నించారు. రాయలసీమ హక్కుల కోసం ప్రభుత్వం ఎందుకు పోరాడలేకపోతోందని నిలదీశారు. రాష్ట్ర సమగ్రతకు ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని మైసూరారెడ్డి హితవు పలికారు.

Related posts

జాతీయ రాజకీయాలెందుకు?.. కేసీఆర్ కు షర్మిల లేఖ!

Drukpadam

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

Drukpadam

స్థానిక సంస్థల ఎన్నికలు టీఆర్ యస్ కు సవాల్…

Drukpadam

Leave a Comment