ఖమ్మం వార్తలు

చక్రం తిప్పిన భట్టి …నూతికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి..

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది …ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం విషయంలో డిప్యూటీ సీఎం భట్టి మాటే ఫైనల్ అవుతుందనే విషయంలో ఎవరికీ ఈలాంటి సందేహాలు లేవు ..కాకపోతే పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ను కొనసాగించటమా…? లేదా అనేది కొంత ఊగిసలాట ఉన్నది …అయితే రాయల నాగేశ్వరరావు ,శ్రీనివాస్ రెడ్డి ,పేర్లు బాగా ప్రచారం అయ్యాయి..చివరకు భట్టికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నూతి సత్యనారాయణను నియామకాల్లో భట్టి చక్రం తిప్పారు ..దీంతో ఆయన నియామకం జరిగింది ..

ఇక ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ ,నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగళ్ళ దీపక్ చౌదరిని నియమించారు … దీపక్ చౌదరి నియామకంలో తుమ్మల మాట చెల్లుబాటు అయినట్లు తెలుస్తుంది …ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా శ్రీదేవి ప్రసన్నను నియమించారు ..

సత్యనారాయణ 1986 సంవత్సరం నాటినుండి.. కాంగ్రెస్ మైత్రి మండలి పేరు తో 80 మంది యువకులతో సంఘాన్ని స్థాపించి సేవలు అందించారు .. మల్లు బట్టి విక్రమార్క . మధిర ఎమ్మెల్యే గా గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించి.. పార్టీని అమ్మగా.. నమ్ముకుంటూ ప్రయాణం సాగించిన.. నూతి సత్యనారాయణ గత రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఏఐసీసీ ప్రామాణికంగా తీసుకుని.. ‘నూతి’ని అర్హుడుగా.. సెలెక్ట్ చేశారని తెలుస్తుంది ..

ఖమ్మం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరని… జిల్లాలో కార్పొరేషన్ చైర్మన్ ను ఒకసారి పరిశీలిస్తే.. ముగ్గురు ఉండగా ఒక్కరు మాత్రమే గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయుడు సత్యం హస్త కళల చైర్మన్ గా కొనసాగుతున్నారు.. బీసీ సామాజిక వర్గం నుండి ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహించారు . బీసీ లో గౌడ సామాజిక వర్గానికి ఆ పదవి ఇప్పటివరకు దక్కలేదు.. ఈ అంశం కూడా అధ్యక్ష పీఠంలో దక్కేలా చేసిందని తెలుస్తుంది .. నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ పురోగతి ఏ జెండాగా… డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అడుగుజాడల్లో నడుస్తున్న నూతి సత్యనారాయణకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని …. పార్టీ కోసం పడిన కష్టం… నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి వున్న నైజం… కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా పార్టీని వీడకుండా… ఉన్నందున ‘నూతి ‘కి బాధ్యతగల డీసీసీ పదవి ఇచ్చారని అంటున్నారు .

రాష్ట్రంలో వివిధ జిల్లాల డీసీసీలకు అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది ..

డీసీసీ కొత్త సారథులకు మంత్రి పొంగులేటి అభినందన…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల నియామకంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను, ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నూతి సత్యనారాయణను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా దీపక్ చౌదరి నియమితులయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ఈ కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయ పరచుకుని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లడంపై దృష్టిసారించాలన్నారు.

Related posts

వరద భాదిత తోటి సభ్యులకు ఫోటో గ్రాఫర్ల యూనియన్ 10 లక్షల ఆర్థిక సహాయం !

Ram Narayana

నల్లగొండకు తరలి వెళ్లిన సిపిఐ శ్రేణులు

Ram Narayana

వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ వార్షికోత్సవం

Ram Narayana