Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ రణరంగం

రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ రణరంగం
– రెడ్ ఫోర్ట్ ను చుట్టుముట్టిన రైతులు
-లాఠీ ఛార్జ్ -బాష్పవాయి ప్రయోగం ,
-ఒక రైతు మృతి… పలువురికి పోలీసులకు గాయాలు
-హోమ్ మంత్రి ఆరా ? ఉన్నతస్థాయి సమీక్షా
రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ లో జరిగిన రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ రణరంగంగా మారింది. రైతులు , పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలు ,వీధి పోరాటాలను తలపింపచేశాయి. రైతుల పై పోలిసుల లాఠీచార్జి చేశారు. బాష్పవాయి గోళాలు ప్రయోగించారు. ఒక రైతు మృతి చెందారు. దీనిపై రైతులు , పోలిసుల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి.పోలిసుల లాఠీ ఛార్జ్ వల్లనే రైతు మరణించారని రైతులు చెపుతుండగా లేదు రైతు ట్రాక్టర్ ప్రమాదం వల్లనే మరణించారని పోలీసులు తెలిపారు. ర్యాలీ సందర్భగా ప్రతిష్టాత్మక ఎర్రకోటను రైతులు ముట్టడించారు. మినహా మొత్తం మీద జయప్రదంగా జరిగింది. ఢిల్లీ ఒకటే నినాదం మారుమోగింది , కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని .ఢిల్లీ వీధులు రైతుల నినాదాలతో దద్దరిల్లాయి . తిక్రి , సింఘా , ఘజియాబాద్ రహదారులన్నీ రైతుల ట్రాక్టర్ల తో నిండిపోయాయి. రైతుల భారీగా ఢిల్లీకి చేరుకోటంతో ఒక సందర్బాల్లో వారిని అదుపు చేయటం నిర్వాహకులకు సైతం తలకు మించిన భారం అయింది . కొందరు రైతులు ఎర్రకోటను సైతం వదలలేదు. ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతీయ జెండా ఎగురవేసే బురుజులు దగ్గరకు చేరుకొని వాటికీ తమ వెంట తెచ్చిన జెండాలను కట్టి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకొనేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం బలవంతంగా ట్రాక్టర్ల తొలగించి ముందుకు సాగారు. ఈ సందర్బంగా పోలీసులకు ,రైతులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. రైతుల పోలీసుల మధ్య జరిగిన గొడవ సందర్భంగా ఒక రైతు మృతి చెందాడు . పోలీసులే రైతుని చంపారని రైతులు ఆరోపిస్తుండగా , లేదు రైతు టాక్టర్ నడుపుతూ ఫల్టీలు కొట్టించినందునే పడిపోయి ట్రాక్టర్ కింద పది చని పోయాడని పోలీసులు అంటున్నారు. ఇందుకు సాక్ష్యం గా వీడియోను సైతం వారు చూపిస్తున్నారు .

రెండు నెలలుగా ఢిల్లీలో చేస్తున్న రైతుల ఆందోళనలకు కొనసాగింపుగా జరిగిన కిసాన్ రిపబ్లిక్ పెరేడ్ హిసాత్మకంగా మారింది. దీంతో నిర్వాకులు తలలు పట్టుకున్నారు. కొందరు ప్రదర్శన కారులు ఢిల్లీలోని ఎర్ర కోటను చుట్టుముట్టి నానా హంగామా సృష్టించటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. . నిర్వాహకుల అంచనాలకు మించి రైతులు ఈ ర్యాలీ లో పాల్గొనటంతో కంట్రోల్ తప్పింది. వివిధరాష్ట్రాల నుంచి రైతులు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చెరోకోవటం తో ఢిల్లీ సరిహద్దులు అన్ని రైతుల ట్రాక్టర్ల తో నిండి పోయాయి. సుమారు రెండు లక్షల కు పైగా ట్రాక్టర్లు ఢిల్లీ ర్యాలీకి వచ్చినట్లు పోలీసుల అంచనా . ఢిల్లీ పోలీసులు కేవలం 5 వేల ట్రాక్టర్ల కు మాత్రమే ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ అంత రైతులతో నిండి పోవటంతో వారిని అదుపుచేయడం పోలీసులకు కూడా తలకు మించిన భారంగా మారింది. పలు ప్రాంతాలలో ఇంటర్ నెట్ సేవలను సైతం నిలిపి వేశారు. మెట్రో రైళ్లను రద్దుచేశారు. ప్రదర్శన కారులను అదుపు చేయటంలో పోలీసులకు ఇబ్బందిగా మారటం తో అదనపు బలగాలను రప్పించారు.

ఎర్రకోట ను ఖాళీ చేయాలనీ రైతు సంఘాల నేతలు రైతులకు పిలుపునిచ్చారు. ఢిల్లీని ఖాళీచేసి సరిహద్దులకు రావాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ రైతులను కోరారు. ఎర్ర కోట సంఘటనలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భాద్యత వహించాలని ఎన్ సి పి నేత శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్,రైతులు రోడ్ ఎక్కేపరిస్థిలు మంచివి కావని తెలుగు దేశం నేత చంద్రబాబు లతో పటు వివిధ రాజకీయ పార్టీలు అన్నాయి. రైతు ఉద్యమం హిసాత్మకంగా మారటం పై రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని నిర్ణయించాయి .

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా , ఉన్నత స్థాయి సమీక్షా
ఢిల్లీలో రైతు ర్యాలీ సందర్బంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉన్నత స్థాయి సమీక్షా చేశారు. జరిగిన సంఘటనల పట్ల కేంద్ర ఆందోళన వ్యక్తం చేసింది .

Related posts

ఏపీ లో మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా …తిరిగి వచ్చేది ఎవరు ?

Drukpadam

రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు.. స్మార్ట్‌మేన్:రఘురామ్ రాజన్ ప్రశంసలు

Drukpadam

సినీ నటులకు కలిసిరాని ఎన్నికలు …ఉదయనిధి మినహా అందరూ ఓటమి!

Drukpadam

Leave a Comment