Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలు …10 వేల జరిమానా!

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలు …10 వేల జరిమానా
-2019 ఎన్నికల్లో బూర్గుపహాడ్ మండలం లో డబ్బులు పంచుతూ పట్టుపడ కవిత అనుచరులు
-కోర్ట్ లో డబ్బులు పంచినట్లు అంగీకరించటంతో శిక్ష
-బైలు మంజూరి చేసిన ప్రజాప్రతినిధుల కోర్ట్ …10 వేల జరిమానా చెల్లింపు

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరునెలల జైలుతోపాటు  జరిమానా విధించింది. దానితోపాటు 10 వేల జరిమానా కూడా కోర్టు విధించింది. 2019 ఎన్నికల్లో బూర్గుపహాడ్ మండలంలో డబ్బులు పంచుతూ కవిత అనుచరులు పట్టుబడ్డారు . దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అది ప్రజాప్రతినిధుల కోర్టు లో విచారణకు వచ్చింది.విచారణ సందర్భంగా డబ్బులు పంచుతూ పట్టుబడ్డ విషయాన్నీ కవిత అనుచురులు అంగీకరించారు.షౌకత్ అలీ అనే టీఆర్ యస్ కార్యకర్త 2019 ఎన్నికల్లో కవిత ఆదేశాను సారం డబ్బులు పంచినట్లు అంగీకరించారు.దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఎంపీ కవితకు 6 నెలల జైలు , 10 వేల రూపాయల జరిమానా ఇస్తూ తీర్పు చెప్పింది.అయితే వెంటనే ఎంపీ బైలు కోసం దరఖాస్తు చేసుకోవడంతో కోర్టు బైలు ను మంజూరు చేసింది. 10 వేల రూపాయల జరిమానా మంజూరు చేసింది.

Related posts

కమలా హారిస్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన యూఎస్ నర్స్… అరెస్ట్

Drukpadam

హనుమంతుడి జన్మస్థలం ఏది నిజం? …ఏది అబద్దం ?

Drukpadam

రైల్వేకు తత్కాల్ టికెట్ల రూపంలో భారీ ఆదాయం!

Drukpadam

Leave a Comment