ఖమ్మం వార్తలు

గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ నేతలు.. స్వాగతించిన ఎంపీ వద్దిరాజు

గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ నేతలు భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్

  • సాదరంగా స్వాగతించిన ఎంపీ వద్దిరాజు

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గండిపడింది. నియోజకవర్గంలో కీలకమైన టేకులపల్లి మండలంలో గట్టిపట్టున్న నేతలు
భూక్య దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ లు కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం గులాబీ గూటికి చేరారు. ఈ ఇరువురు నేతలను ఎంపీ రవిచంద్ర.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడించారు. ఆయన సూచన మేరకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ ఇద్దరు కీలకమైన నేతలను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు.

నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్ జెండాను మోసిన తన కుటుంబానికి సర్పంచ్ సీటు ఇవ్వమని ప్రాధేయపడ్డా.. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సీటు ఇవ్వకుండా మోసం చేశారనే మనో వేదనతో ఆ పార్టీని వీడి, బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డ దళ్ సింగ్ నాయక్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈయనతో పాటు మరో కీలకమైన నేత, టేకులపల్లి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ కూడా కాంగ్రెస్ ను వీడి తిరిగి బిఆర్ఎస్ లో కొనసాగడానికి సిద్ధపడ్డారు. అదే విషయాన్ని కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లగా ఆయన పునరాహ్వానం పలికారు. ఈ మేరకు ఎంపీ రవిచంద్ర టేకులపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. వీరితోపాటు చుక్కాలబోడు తండా, ఎక్సైజ్ దాసు తండా లో ఏకగ్రీవంగా ఎన్నికైన 11 మంది గ్రామ వార్డు మెంబర్లు, సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందిన మాజీ దళ కమాండర్ పూనెం నర్సయ్య లు కూడా ఎంపీ రవిచంద్ర సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, టేకులపల్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, నాయకులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మానవత్వం లేని బీజేపీ …చవకబారు రాజకీయాలు మానుకోవాలి …ఖమ్మంలో అఖిలపక్ష నేతలు

Ram Narayana

తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

ముగిసిన ఎన్నికల కోడ్ …అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం ద్రుష్టి ..

Ram Narayana