ఏలూరు కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు… 47 డివిజన్లలో ఎదురులేని వైసీపీ
-ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం
-కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు
-గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం
-ఇవాళ 47 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
-44 డివిజన్లలో వైసీపీ విజయం
-3 డివిజన్లతో సరిపెట్టుకున్న టీడీపీ
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.
బీజేపీ ,జనసేన , వామపక్షలకు ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. మిగతా కార్పొరేషన్ లతోపాటు ఏలూరు ఎన్నకలు కూడా జరిగాయి. దీనిపై కోర్టు కు వెళ్లడంతో కోర్టు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై స్టే విదంచింది. ఇటీవలనే స్టే తొలగించిన హైకోర్టు ఎన్నికల ఓట్ల లెక్కింపుతోపాటు , ఫలితాలు వెల్లడించవచ్చునని చెప్పింది.దీంతో ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు.మొత్తం 50 డివిజన్లలు గాను 47 డివిజన్లలో వైకాపా విజయకేతనం వేగరవేసింది. దీంతో వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.