Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

వైరస్ ఏదైనా ఇక ఒకటే మందు.. కెనడా శాస్త్రవేత్తల కీలక ముందడుగు!

వైరస్ ఏదైనా ఇక ఒకటే మందు.. కెనడా శాస్త్రవేత్తల కీలక ముందడుగు
‘డ్రగ్ బైండింగ్ పాకెట్ల’ను గుర్తించిన శాస్త్రవేత్తలు
కాలపరీక్షకు తట్టుకుని నిలబడుతున్నట్టు గుర్తింపు
వాటిని లక్ష్యంగా చేసుకుని ఔషధ తయారీ

కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచానికి ఇది శుభవార్తే. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసేలా కెనడా శాస్త్రవేత్తలు ఓ ఔషధాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కీలక ముందడుగు వేశారు. వైరస్ ప్రొటీన్‌లలో కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన ‘డ్రగ్ బైండింగ్ పాకెట్ల’ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

పరిశోధనలో భాగంగా కరోనా బాధితుల నుంచి సేకరించిన వేల నమూనాల్లోని వైరల్ ప్రొటీన్లను విశ్లేషించిన అనంతరం వీటిని గుర్తించారు. ప్రొటీన్లలోని కొన్ని భాగాల్లోకి ఔషధాలు చేరుతుంటాయి. తద్వారా ఆ ప్రొటీన్‌ను దెబ్బతీస్తాయి. వీటినే డ్రగ్ బైండింగ్ పాకెట్లుగా పిలుస్తారు.

ఇవి ఆ తర్వాత ఉత్పరివర్తన చెందడంతో ప్రొటీన్ భాగాల్లో ఔషధాలు ఇమడలేవు. ఇలాంటి భాగాల్లో కొన్ని ప్రొటీన్ పనితీరుకు అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవి మార్పులకు లోనుకావు. వీటిని లక్ష్యంగా చేసుకుని కరోనాలోని అన్ని వైరస్‌లకు ఒకే ఔషధాన్ని అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది నిజంగా ముందడుగే అంటున్నారు శాస్త్రవేత్తలు

Related posts

లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 20న క్యాబినెట్ నిర్ణయిస్తుంది: కేటీఆర్…

Drukpadam

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు కొట్టుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయి: కేజ్రీవాల్…

Drukpadam

టీకాల విషయంలో.. ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు…

Drukpadam

Leave a Comment