క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో దారుణం …

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో దారుణం …

క్యాంపస్​లో దారుణం జరిగింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇద్దరు దుండగులు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ‘ డిసెంబర్ 23 రాత్రి బాధితురాలు, ఆమె స్నేహితుడు కలిసి అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టి బయటకు తరిమేశారు. తరువాత వారిద్దరూ కలిసి ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. తరువాత ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన (నగ్న) ఫొటోలను తమ సెల్ పోన్ తో తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తరువాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.’ అయినప్పటికీ ఆమె భయపడకుండా మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు.

ఓ..నిందితుడు అరెస్ట్
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 64 ప్రకారం రేప్ కేస్ నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో ఓ నిందితుని ఇప్పటికే పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Related posts

బెంగళూరులో వైరల్ గా మారిన టూలెట్ ప్రకటన.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

Ram Narayana

లండన్‌లో అర్ధరాత్రి భారత సంతతి మహిళ హత్య…

Ram Narayana

ఎన్‌సీఈఆర్టీలో న్యాయవ్యవస్థలో అవినీతి పాఠ్యాంశం.. స్పందించిన కేంద్రం…

Ram Narayana