తెలంగాణ వార్తలు

రాష్ట్రానికి పెట్టుబడులు ..రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ..

రాష్ట్రానికి పెట్టుబడులు ..రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో కలిసి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితోకలిసి ఆయన ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచ వేదికపై తెలంగాణ సత్తా..

ప్రపంచ ఆర్థిక వేదిక వేదికగా తెలంగాణ తన సత్తా చాటుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం దావోస్‌లో పలు కీలక ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌నూ ప్రపంచానికి పరిచయం చేసింది.

మెగాస్టార్ ప్రత్యేక ఆకర్షణ
జ్యూరిచ్‌లో పర్యటిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంతో దావోస్ సదస్సుకు హాజరయ్యారు చిరు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించి, రాష్ట్ర అభివృద్ధిపై తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో కలిసి చిరంజీవి పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు.

Related posts

మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం…

Ram Narayana

విద్యార్థుల ప్రేమను చూరగొన్న టీచర్ …

Ram Narayana

టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మ‌న్‌గా బుర్రా వెంక‌టేశం..!

Ram Narayana