తెలంగాణ రాజకీయ వార్తలు ..

పవన్ బీజేపీకి ఎన్నికల ప్రచారంపై పీసీసీ చీఫ్ ఫైర్ …ఆయన తెలంగాణ వ్యతిరేకి అని విమర్శ

పవన్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి.. ఇక్కడ ఆయన మాట విని ఓటేసే వారు లేరు

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారంటూ వార్తలు
  • పవన్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించిన మహేశ్ గౌడ్
  • పవన్‌ను బీజేపీ నేతలు ‘భిక్షాం దేహీ’ అని అడిగారంటూ ఎద్దేవా

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేశ్ గౌడ్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.”బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను భిక్షాం దేహీ అని అడిగారు” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం చేశారు. 

Related posts

ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి

Ram Narayana

జనాభా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి…బీఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత

Ram Narayana

తెలంగాణ టీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో చీఫ్ రావుల!

Ram Narayana