- రేపు, ఎల్లుండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్న పవన్
- ఎన్నికల ప్రచారం రద్దయినట్టు ప్రకటించిన జనసేన
- అనివార్య కారణాల వల్లే ప్రచారం రద్దయినట్టు సమాచారం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ఇంతకు ముందు వెలువడిన ప్రకారం రేపు, ఎల్లుండి ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారం రద్దయినట్టు జనసేన ప్రకటించింది. ఏపీలో రాజకీయ పరిణామాలు, పవన్ వ్యక్తిగత కారణాల వల్లే ప్రచారం రద్దయినట్టు సమాచారం.
మరోవైపు, మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో ఈ ఉదయం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో పవన్ చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్ (ఆర్కే నాయుడు) తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: