తెలంగాణ వార్తలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్ధి ఆత్మహత్య…

  • నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఘటన 
  • ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ అభ్యర్ధి మహాదేవప్ప
  • సోషల్ మీడియాలో ప్రత్యర్ధుల వేధింపులే ఆత్మహత్యకు కారణమన్న భార్య సత్తెమ్మ

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నారాయణపేట జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే.. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందిన మహాదేవప్ప (48) బీజేపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహదేవప్ప భార్య సత్తెమ్మ తీవ్ర ఆరోపణలు చేసింది. 

సోషల్ మీడియాలో ప్రత్యర్థుల వేధింపులు, అవమానకర ప్రచారాల కారణంగానే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Related posts

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం… కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లింది పరామర్శకేనా?

Ram Narayana

మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులు

Ram Narayana

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

Ram Narayana