ఏపీ హైకోర్టు వార్తలు

పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు

  • చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు
  • పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని… క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

వెంకట్రామిరెడ్డి ఉద్యోగ తొలగింపు కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు…

Ram Narayana

 పిన్నెల్లి సోదరులకు నిరాశ.. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరణ…

Ram Narayana

ఐటీ కంపెనీలకు భూకేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Ram Narayana