Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల రాజేందర్ భార్య జమున స్పీచ్ మైండ్ బ్లోయింగ్!

ఈటల రాజేందర్ భార్య జమున స్పీచ్ మైండ్ బ్లోయింగ్!
పంచ్ డైలాగులతో టీఆర్ యస్ పై విరుచుకుపడిన జమున
ఈటల అస్వస్థతతో పాదయాత్రకు బ్రేక్కొనసాగించిన జమున
ఉద్యమకారులను సాగనంపే క్రమంలోనే ఈటలపై వేటు అన్నారు జమున
తాము తప్పు చేస్తే ముక్కునేలకు రాస్తామని ఆనాడే చెప్పమన్న జమున
తాము దళితులకు వ్యతిరేకమని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం
తాము పెట్టె వాళ్ళమే కాని పొట్ట కొట్టేవాళ్ళం కాదన్న జమున
దళితులకు న్యాయం జరిగితే తమకన్నా సంతోషించేవాళ్ళు ఎవరు లేరన్న జమున

హుజురాబాద్ పాదయాత్రలో ఈటల రాజేందర్ కు అస్వస్థత వేర్పడటం తో శుక్రవారం షడ్యూల్ ప్రకారం తిరగాల్సిన మూడు గ్రామాల్లో ఆయన భార్య జమున పర్యటన చేశారు. సాయంత్రం ఆమె ఈటల అస్వస్థత కు గురైన దగ్గర ప్రారంభమైన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. వివిధ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగాలు ప్రత్యర్థులకు మైండ్ బ్లోయింగ్ ల పిడుగులా వర్షం కురిపించారు.తన భర్త ఈటల రాజేందర్ కు జరిగిన అన్యాయం పై ఆమె చెప్పిన మాటలు ప్రజలను హత్తుకునేలా చేశాయి. కేసీఆర్ పేరుకు భూకబ్జా అని చెప్పేదే కాని రాజేందర్ ను ఎప్పటి నుంచో బయటకు పంపాలనే కుట్రపెట్టుకున్నారని చెప్పిన తీరు ప్రజల నుంచి స్పందన వచ్చేలా చేసింది. ప్రజలు ,ఈలలు , కేరింతలు తో ఈటల నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. తాము తప్పు చేస్తే ముక్కు నెలకు రాస్తామని చెప్పమని దానిపై ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదని దాన్ని బట్టే అర్థం అవుతుంది మేము ఏ తప్పు చేయలేదని అన్నారు. 18 సంవత్సరాలుగా ఉద్యమంలో పని చేసిన అందరిని బయటకు పంపిన కేసీఆర్ ఈటలను కూడా పంపాలనే లక్ష్యంతోనే తప్పుడు ఆరోపణలు చేసి మంత్రివర్గం నుంచి తప్పించారని అన్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనేక మందికి ఉద్యమం తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కేసీఆర్ ఎన్ని పన్నాగాలు పన్నినా ఈటల గెలుపును ఆపలేరని లక్ష ఓట్ల మైజార్టీ తో గెలుస్తారని ప్రజల హర్షద్వానాల మధ్య చెప్పారు . నాయకులను కొనుగోలు చేసిన ప్రజలను ,ప్రత్యేకించి హుజురాబాద్ ప్రజలను కొనుగోలు చేయలేరని ఆమె అన్నారు.

పాదయాత్ర ఆగటం భాదగా ఉందిఆగిన చోటు నుంచే యాత్ర మొదలవుతుంది: ఈటల

వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలానే ఉన్నాయి
ఆరోగ్యం కుదుటపడగానే యాత్ర ప్రారంభమవుతుంది
ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఈటల

వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలానే ఉన్నాయని, ఆగిన చోటు నుంచే యాత్ర మొదలవుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఊహించని అస్వస్థత కారణంగా ‘ప్రజా దీవెన’ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందని, ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కొండంత మీ దీవెనలతో మళ్లీ యాత్ర ప్రారంభిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈ నెల 19న నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం నుంచి ఈటల పాదయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు 222 కిలోమీటర్ల మేర సాగింది. నిన్న వీణవంక మండలం కొండపాక వరకు నడిచారు. మధ్యాహ్న భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షలు చేయగా, జ్వరం, కాళ్ల నొప్పులతో ఈటల బాధపడుతున్నట్టు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

బండి సంజయ్ ,వివేక్ పరామర్శ ….

పాదయాత్రలో అస్వస్థత కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ పరాపర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన టీఆర్ యస్ కు ఓటమి తప్పదని అన్నారు.

 

Related posts

చంద్రబాబు స్వరంలో ఎందుకబ్బా …?

Drukpadam

ఏప్రిల్ నెలలో హైదరాబాదులో రూ.2,230 కోట్ల మేర ఇళ్ల కొనుగోళ్లు!

Drukpadam

బీజేపీతో పెట్టుకుంటే మాడిమసైపోతారు..కేసీఆర్ కు బండి సంజయ్ హెచ్చరిక!

Drukpadam

Leave a Comment