రఘువీరా ,జేసీ సోదరులు ఒక్కటి కానున్నారా ?
-నీలకంఠాపురంలో రఘువీరారెడ్డిని కలిసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
-నీలకంఠాపురం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-రఘువీరాతో ఆత్మీయ భేటీ
-రాయలసీమ నీటి అంశాలపై చర్చ
-మద్దతు ఇవ్వాలని రఘువీరాకు విజ్ఞప్తి
రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా,శత్రువులు మిత్రులుగా మారటం సహజం . అందులో భాగంగానే మాజీ పీసీసీ అధ్యక్షులు ఎన్ .రఘువీరా రెడ్డి తో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మొదటి నుంచి జేసీ సోదరులకు , రఘువీరారెడ్డికి మధ్య అంత సఖ్యత లేదు. కాగ్రెస్ పార్టీలో కలిసి ఉన్న భిన్న దృవాలుగా ఉండే వారు . కలిసిన ముక్తసరిగా మాటాడుకోవడం తప్ప ఆప్యాయత లేదు. చాల కలం తరువాత వారిమధ్య మనసు ఇప్పి మాట్లాడుకునే సందర్భం వచ్చింది . రాయలసీమ నీటి సమస్యలపై పార్టీలకు అందరిని ఐక్యం చేయాలనీ చూస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అందరిని కలుస్తున్నారు. దానిలో భాగంగానే ఎడమొగం ,పెడమొగం గా ఉండే నాయకుల కలయికపై రాజకీయవర్గాలలో ఆశక్తి నెలకొన్నది .
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ రాజకీయవేత్త రఘువీరారెడ్డి ప్రస్తుతం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బిజీ అయ్యారు. తన సొంతూరు అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో భారీ ఎత్తున ఆలయ పునర్ నిర్మాణం చేపట్టిన రఘువీరా ఎక్కువ సమయం అక్కడే గడుపుడుతున్నారు. కాగా, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ రఘువీరారెడ్డిని కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నీలకంఠాపురం విచ్చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి… రఘువీరాతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. రఘువీరా కుటుంబీకులు నిర్మించిన ఆలయాలను సందర్శించారు. రఘువీరా వెంట ఉండి జేసీకి ఆలయాలను చూపించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పూజలు కూడా చేశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ, సీమ నీటి సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే రఘువీరాను కలిసినట్టు తెలిపారు.
ఒకప్పుడు జేసీ సోదరులు, రఘువీరా కాంగ్రెస్ లోనే ఉండేవారు. కాలక్రమంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరగా, రఘువీరా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం పీసీసీ బాధ్యతలు చేపట్టినా, క్రమంగా పార్టీకి దూరమయ్యారు.