Sri Duddu Satya Venkata Surya Subrahmanya Ganesha Sharma
జాతీయ వార్తలు

కంచి కామ కోటి పీఠాధిపతిగా ఏపీకి చెందిన గణేశ్ శర్మ

తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామ కోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన రుగ్వేద పండితుడు గణేశ్ శర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాధ శాస్త్రి పేర్కొన్నారు. అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు. యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ్ శర్మ. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశ్ శర్మకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల అన్నవరం క్షేత్రంలోని వ్రత పురోహితులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్.. స్వాగతం పలికిన కేజ్రీవాల్

Ram Narayana

భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ కుమారుడు…

Ram Narayana

17వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ…

Ram Narayana