పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్‌లోని ప్రవాస భారతీయలు పాకిస్థాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సమయంలో పాకిస్థాన్ డిఫెన్స్ అటాషెగా పని చేస్తున్న తైమూర్ రహత్ అనే అధికారి బయటకు వచ్చి నిరసనకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. వారిని చూస్తూ గొంతు కోస్తున్నట్లు చేతితో సైగ చేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా తైమూర్ రహత్ ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2019 లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ ప్రమాద వశాత్తు పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అవమానించేలా ఉన్న ఓ పోస్టర్‌ను ప్రదర్శిస్తూ ఆయన కనిపించినట్లు వార్తలు వచ్చాయి. భారత నిరసన కారులను భయపెట్టేందుకే దౌత్య వేత్త ఉద్దేశపూర్వకంగా ఈ రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారని పలువురు భావిస్తున్నారు. ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య వేత్త స్థాయికి తగని రీతిలో వ్యవహరించని తైమూర్ రహత్‌ను తక్షణమే వెనక్కి పిలిపించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: