Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కృష్ణ , గోదావరి నదుల బోర్డు సమావేశం …తెలంగాణ అధికారుల గైర్హాజరు!

కృష్ణ , గోదావరి నదుల బోర్డు సమావేశం …తెలంగాణ అధికారుల గైర్హాజరు!
-ఏపీ అధికారుల హాజరు.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు
-కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశం
-అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని ఆదేశం
-ఇవ్వలేమని చెప్పిన ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి జగడం ఇంకా సమసి పోలేదు.కేంద్రం ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ప్రాజక్టులపై అభ్యంతరాలు ఉన్నాయని సమావేశానికి హాజరైన ఏపీ నీటి పారుదల అధికారులు తెలిపారు. బోర్డులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివరాలను సమర్పించలేమని ఏపీ అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం . ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్ధం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హాలియాలో జరిగిన బహిరంగ సభలోను ఏపీ దాదాగిరి చేస్తుందంటూ కన్నెర్ర చేశారు.

బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టుల వివరాలను సమర్పించలేమని ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఇవాళ హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అధికారులెవరూ హాజరు కాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతినిధి, బోర్డుల సభ్యులు, ఏపీ ఈఎన్ సీలు, ట్రాన్స్ కో, జెన్ కో ఎండీలు హాజరయ్యారు.

సమావేశంలో భాగంగా ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాలను రెండు బోర్డులు కోరాయి. ఇకపై సమన్వయ కమిటీ సమావేశాలు ఎప్పుడూ జరుగుతుంటాయని చెప్పాయి. ఈ నెల రెండో వారంలో బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్ఎంబీ తెలిపింది.

గెజిట్ నోటిఫికేషన్ లోని ప్రాజెక్టులపై మరింత స్పష్టత కావాలని నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల వివరాలను ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని బోర్డులకు తెలిపారు.

Related posts

చెవి నొప్పికి ఆపరేషన్ చేస్తే.. ఎడమ చేయిని కోల్పోయిన యువతి!

Drukpadam

రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో దావా వేస్తా: లలిత్ మోదీ!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకుకే పట్టం కట్టాలి-జాజుల

Drukpadam

Leave a Comment